ఏపీపీహెచసీ వైద్యుల సంఘం కార్యవర్గం ఎన్నిక
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:46 PM
నంద్యాల జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల సంఘం కార్యవర్గ ఎన్నికలను ఆదివారం నిర్వహించారు.
నంద్యాల హాస్పిటల్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యుల సంఘం కార్యవర్గ ఎన్నికలను ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారి డాక్టర్ లలిత ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో 82 మంది వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీహెచసీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడుగా కే అంకిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎన చెన్నకేశవులు, కోశాధికారిగా నేగల ఉసేని, గౌరవ సలహాదారులుగా మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసులు, భగవానదాస్, నాగలక్ష్మి, బాబు, రంగారెడ్డి, ఉపాధ్యక్షులుగా ప్రసన్నలక్ష్మి, కాంతారావునాయక్, ప్రణిత, మహిళా కార్యదర్శిగా నిర్మల్‌శ్రీజ, సహాయ కార్యదర్శులు, కోశాధికారులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.