Corruption Case: ఏపీఎంఎస్ఐడీసీ జీఎం అరెస్టు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:03 AM
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌డీసీ ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను అక్రమాస్తుల కేసులో...
అక్రమాస్తుల కేసులో ఏసీబీ అదుపులో సూర్యకళ
27 చోట్ల స్థిరాస్తులు.. రూ.2 కోట్ల ఎఫ్‌డీలు గుర్తింపు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్‌డీసీ ) జనరల్ మేనేజర్ మల్లాది వెంకట సూర్యకళను అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమె అక్రమాస్తులు కూడబెట్టినట్లు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఏపీఎంఎస్‌డీసీ కార్యాలయంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని ఆమె నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 9గంటలకే ఏపీఎంఎస్‌డీసీ కార్యాలయానికి చేరుకున్న అధికారులు ఆమె చాంబర్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. ఆమె ఆఫీసుకు రాగానే సమాచారం అందించారు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన నివాసాల్లో నాలుగు చోట్ల సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జరిగిన సోదాల్లో దాదాపు 27 చోట్ల.. ఇళ్లు, ఇళ్లస్థలాలు, వ్యవసాయ భూములు ఆమె పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. రూ.2 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. మూడు ఇళ్లల్లో బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.9 లక్షల విలువైన నగదును వద్ద గుర్తించారు. ఇవి కాకుండా రెండు కార్లు ఆమె పేరు మీద ఉన్నాయి. మొత్తంగా ఆమె ఆస్తుల విలువ రూ.6 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజులు సోదాలు కొనసాగుతాయని తెలిపారు.