Share News

Government and Private Institutions: 31 సంస్థలు... 121.36 ఎకరాలు

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:41 AM

రాజధాని అమరావతిలో పలు ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు ఏపీసీఆర్డీఏ భూములు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Government and Private Institutions: 31 సంస్థలు... 121.36 ఎకరాలు

  • రాజధానిలో భూములు కేటాయించిన సీఆర్డీఏ

  • చ.మీ.కు ఏడాదికి రూపాయి... 60 ఏళ్లకు లీజు

  • ప్రైవేటు సంస్థలకు ఎకరం రూ.50 లక్షలకు

గుంటూరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో పలు ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు ఏపీసీఆర్డీఏ భూములు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4న జరిగిన సీఆర్డీఏ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు మొత్తం 31 సంస్థలకు 121.36 ఎకరాలు కేటాయించారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సిబ్బంది నివాస స్థలాల కోసం ఈ భూములు కేటాయించినట్లు

కొత్తగా 11 సంస్థలకు భూములు

ఏపీసీఆర్డీఏకి తాజాగా ప్రతిపాదనలు అందిన 11 సంస్థలకు 49.5 ఎకరాలు కేటాయించారు. బేసిల్‌-ఉడ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ఎకరం రూ.50 లక్షలు చొప్పున మందడంలో 4 ఎకరాలు, సెయింట్‌ మేరిస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ఎకరా 50 లక్షల చొప్పున తుళ్లూరులో 7.97 ఎకరాలు కేటాయించారు. సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌కు ఎకరానికి రూ.4.1 కోట్ల చొప్పున ప్రీమియంతో చదరపు మీటరుకు ఒక రూపాయి లీజుతో 60 ఏళ్లపాటు నవులూరులో 15 ఎకరాలు లీజుకు ఇచ్చారు. కేంద్ర సంస్థ కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)కు ఐనవోలులో ఐదెకరాలు, ఎన్‌టీపీసీ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌కు రాయపూడిలో 1.50 ఎకరాలు, ఏపీ జ్యూడీషియల్‌ అకాడమీకి పిచుకలపాలెంలో 4.83 ఎకరాలు, కేంద్ర సంస్థ కాస్మోస్‌ 2- ప్లానిటోరియమ్‌కు అనంతవరంలో 5 ఎకరాలు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంకులకు ఉద్దండరాయునిపాలెంలో 0.40 ఎకరాలు చొప్పున, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఎన్‌ఏసీ)కి తుళ్లూరులో 5 ఎకరాలు రూ.4.1కోట్ల ప్రీమియం, చ.మీ.కు ఒక రూపాయి లీజుతో 60ఏళ్ల పాటు భూములు కేటాయిచారు.


6 సంస్థలకు కేటాయింపుల్లో మార్పులు

అమరావతి పరిధిలో ఆరు సంస్థలకు గతంలో కేటాయించిన భూములను సవరించి తాజాగా 42.30 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీకి ఎకరాకు రూ.50 లక్షల చొప్పున తుళ్లూరులో 8 ఎకరాలు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌ కార్యాలయానికి నిడమర్రులో 1.34 ఎకరాలు, ఐఆర్‌సీటీసీకి తుళ్లూరులో 2 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీహెచ్‌ఆర్డీఐకి ఐనవోలులో 10 ఎకరాలు, చదరపు మీటరుకు ఏడాదికి ఒక రూపాయి లీజు కింద 60 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారు. కాగా ప్రైవేటు సంస్థ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐకి గతంలో ఇచ్చిన 50 ఎకరాలకు అదనంగా మరో 11.79 ఎకరాలు, ఎకరం రూ.50 లక్షల చొప్పున మందడం, ఐనవోలుల్లో కేటాయించారు. ప్రభుత్వరంగ సంస్థ హడ్కోకు గతంలో కేటాయించిన 9.17 ఎకరాలకు అదనంగా మరో 1.17 ఎకరాలు ఎకరానికి రూ. 4 కోట్ల చొప్పున ఐనవోలులో కేటాయించారు.

ఉద్యోగుల నివాసాలకు 12.66 ఎకరాలు

ఏపీ కోఆపరేటివ్‌ బ్యాంకు(ఆప్కాబ్‌) ఉద్యోగుల నివాసాలకు 2.20 ఎకరాలు, భారతీయ స్టేట్‌ బ్యాంకు(ఎ్‌సబీఐ) ఉద్యోగులకు 2.05 ఎకరాలు, ఆర్బీఐ ఉద్యోగులకు 4.04 ఎకరాలు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఉద్యోగులలకు 1.15 ఎకరాలు, కెనరా బ్యాంకు ఉద్యోగులకు 0.80 ఎకరాలు, ఎన్‌ఏఐసీఎల్‌ ఉద్యోగులకు 0.50 ఎకరాలు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులకు 0.82 ఎకరాలు, బీపీసీఎల్‌ ఉద్యోగులకు 1.10 ఎకరాల భూమిని ఐనవోలులో ఎకరాకు రూ.4.1 కోట్ల ప్రీమియంతో, చదరపు మీటరుకు రూపాయి లీజుతో 60 ఏళ్లకు కేటాయించారు.

గత కేటాయింపులకు కొనసాగింపుగా..

2014- 19 మధ్య పలు సంస్థలకు కేటాయించిన కేటాయింపులను సమీక్షించి మరో ఆరు సంస్థలకు అదనంగా 16.19 ఎకరాలు కేటాయించారు. అమరావతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ (దీన్‌ దయాళ్‌ ఆంగ్లో వేదిక్‌(డీఏవీ) స్కూల్‌)కు నెక్కల్లులో ఎకరానికి రూ.50 లక్షల చొప్పున 3 ఎకరాలు కేటాయించారు. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)కు నేలపాడులో 0.5 ఎకరాలు, సిబ్బంది నివాసాలకు ఐనవోలులో 0.60 ఎకరాలు, ఎకరం రూ.4 కోట్ల లెక్కన కేటాయించారు. కాంధారి హోటల్‌కు తుళ్లూరులో ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున ఒక ఎకరం, కినరా గ్రూప్‌ హోటల్స్‌కు మందడంలో ఒక ఎకరం రూ.1.50 కోట్లకు, ఏపీ గ్రంథాలయ శాఖకు చ.మీ.కు రూపాయి చొప్పున ఐనవోలులో 6.19 ఎకరాలు 60ఏళ్ల లీజుకు, గ్లోబల్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ కే-12కు ఎకరం రూ.50 లక్షలకు, శాఖమూరులో 4 ఎకరాలు కేటాయించారు.

Updated Date - Dec 26 , 2025 | 04:41 AM