Share News

ఏపీ మోడల్‌ స్కూల్‌ పరిశీలించిన ఏపీసీ

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:50 PM

బండిఆత్మకూరు మండలం పార్నపల్లె సమీపంలో ఏపీ మోడల్‌స్కూల్‌ను సమగ్రశిక్షా అభియాన ఏపీసీ ప్రేమంతకుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 ఏపీ మోడల్‌ స్కూల్‌ పరిశీలించిన ఏపీసీ
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏపీసీ ప్రేమంతకుమార్‌

నంద్యాల ఎడ్యుకేషన, జూలై 14 (ఆంధ్రజ్యోతి): బండిఆత్మకూరు మండలం పార్నపల్లె సమీపంలో ఏపీ మోడల్‌స్కూల్‌ను సమగ్రశిక్షా అభియాన ఏపీసీ ప్రేమంతకుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల పట్టణ శివారులోని పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే స్థితిలో ఉన్న మోడల్‌స్కూల్‌ను తాత్కాలికంగా ఇటీవల పార్నపల్లె సమీపంలోని ప్రభాత కళాశాల భవనంలోకి మార్చారు. ఈ సందర్భంగా ఏపీసీ పాఠశాలకు చేరుకుని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి బస్సులు సరిపోవడం లేదని తెలుసుకుని అక్కడికక్కడే ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. విద్యార్థులకు ఏ మాత్రం అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీనిచ్చారు. కొత్త బిల్డింగ్‌ నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:50 PM