Share News

Minister Narayana: పెట్టుబడులకు ఏపీ అనుకూలం

ABN , Publish Date - Nov 04 , 2025 | 05:21 AM

పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలను మంత్రి నారాయణ కోరారు.

Minister Narayana: పెట్టుబడులకు ఏపీ అనుకూలం

  • దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి నారాయణ భేటీ

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అనుకూలమని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని దుబాయ్‌లో పారిశ్రామికవేత్తలను మంత్రి నారాయణ కోరారు. దుబాయ్‌ పర్యటనలో భాగంగా తొలి రోజు సోమవారం ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. తొలుత దుబాయ్‌ ఇండియా కాన్సుల్‌ ప్రతినిధులు బీజీ కృష్ణన్‌, సెలీనా శశికాంత్‌తో మంత్రి నారాయణ బృందం భేటీ అయింది. ఆ తర్వాత శోభా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌దత్తతో సమావేశమయ్యారు. అనంతరం భారత కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌ శివన్‌తో లంచ్‌ మీటింగ్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ పర్యటనలో నారాయణతో పాటు సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు, మున్సిపల్‌ శాఖ డైరక్టర్‌ సంపత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 05:22 AM