Minister Gummidi Sandhya Rani: గిరిజన శాఖలో పెండింగ్ పూర్తి
ABN , Publish Date - Dec 16 , 2025 | 03:29 AM
గిరిజన సంక్షేమశాఖలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు.....
మంత్రి సంధ్యారాణి ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పథకాల అమలుపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. గిరిజన విద్య, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక సమీక్ష చేపట్టారు. గిరిజన విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.