Share News

మహిళల రక్షణ చట్టాలు పటిష్ఠం చేస్తాం: అనిత

ABN , Publish Date - Aug 06 , 2025 | 06:00 AM

రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్ఠం చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా మహిళల్ని కించపరుస్తున్న ఉదంతాలపై ఐటీ యాక్ట్‌ 66ఏ పై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మహిళల రక్షణ చట్టాలు పటిష్ఠం చేస్తాం: అనిత

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల రక్షణ చట్టాలు మరింత పటిష్ఠం చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. సోషల్‌ మీడియా వేదికగా మహిళల్ని కించపరుస్తున్న ఉదంతాలపై ఐటీ యాక్ట్‌ 66ఏ పై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌లో వాసవీ మహిళా మండలి, పలు రాజకీయ పార్టీల మహిళా విభాగాల ప్రతినిధులు హోంమంత్రిని కలిశారు. మహిళలు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై హోంమంత్రి స్పందిస్తూ మహిళలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు చేసిన సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చిస్తాం’ అని అనిత చెప్పారు.

Updated Date - Aug 06 , 2025 | 06:01 AM