Share News

Minister Kondapalli: తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాం

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:29 AM

ఏపీలో తయారీ రంగానికి సంబంధించిన ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ....

Minister Kondapalli: తయారీ రంగాన్ని బలోపేతం చేస్తాం

న్యూఢిల్లీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీలో తయారీ రంగానికి సంబంధించిన ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎంఎ్‌సఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన 22వ సీఐఐ గ్లోబల్‌ ఎంఎ్‌సఎంఈ బిజినెస్‌ సదస్సును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎ్‌సఎంఈలు భారీ సంస్థలుగా ఎదగడానికి తగిన అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎంఎస్‌ఎంఈల వృద్థికి తోడ్పడే విధానాలను రూపొందించడానికి ప్రభుత్వ సంస్థలతో మరింత కలిసికట్టుగా పనిచేయాలని సీఐఐని మంత్రి కోరారు. ఈ కార్యక్రమానికి ముందు భారతమండపంలో జరుగుతున్న ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌లోని ఏపీ పెవిలియన్‌ను మంత్రి సందర్శించారు.

Updated Date - Nov 18 , 2025 | 04:29 AM