Minister Nadendla Manohar: ఖరీఫ్‌లో 14 వేల కోట్ల విలువైనధాన్యం కొంటాం
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:46 AM
ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని రైతాంగం నుంచి రూ.14వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనబోతున్నామని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి కేవలం 5 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల.....
రైతులకు 5 గంటల్లోనే నగదు జమ
6.70 కోట్ల గోనె సంచులు సిద్ధం
మిల్లు వద్ద 5 గంటల్లోపే అన్‌లోడ్ చేసే ఏర్పాటు
తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన
తెనాలి, నవంబరు 20: (ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని రైతాంగం నుంచి రూ.14వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనబోతున్నామని, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి కేవలం 5 గంటల్లోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాక కూడా రైతులు కొందరు దళారులకు ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితులు కనిపించటంతో మంత్రి గురువారం కృష్ణ, గుంటూరు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలో భాగంగా రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఎ్‌సకేల దగ్గర వరకు వెళ్లకుండా వాట్సప్ ద్వారానే ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని వారికి వివరించారు. గత సీజన్‌లో కేవలం రూ.8,800 కోట్ల విలువైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశామని, ఈ సంవత్సరం దానిని రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకు రూ.754.34 కోట్ల విలువైన 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించిన నగదును కేవలం 5 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రోజుకు మూడు దఫాలుగా లెక్కించి రైతులకు ధాన్యం డబ్బు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గోతాలు, లేబర్, రవాణాకు సంబందించిన మొత్తాలను గత ప్రభుత్వ కాలంలో లాగా దళారులు, మిల్లర్లకు కాకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ఖరీ్‌ఫలో 6.32 కోట్ల గోనె సంచులు అవసరమని గుర్తిస్తే, 6.70 కోట్ల సంచులు సిద్దం చేశామన్నారు. రైతు పొలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని మిల్లులకే పంపేలా నిర్ణయం తీసుకున్నామని, మిల్లు వద్దకు వెళ్లాక కచ్చితంగా 5 గంటల వ్యవధిలోనే అన్‌లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఒకవేళ 5 గంటలకు మించి వాహనం నిరీక్షిస్తే వెంటనే జీపీఆర్‌ఎస్ ద్వారా తమ సెంట్రల్ కార్యాలయానికి మెసేజ్ వస్తుందని, దాని ఆధారంగా కారణాలు తెలుసుకుని వెంటనే అన్‌లోడ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో రైతుల ఇబ్బందులను గుర్తించి ఆర్‌ఎ్‌సకేల దగ్గర, మిల్లుల దగ్గర కూడా ఒకే విధమైన తేమ కొలిచే యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాటిలో వ్యత్యాసం వస్తే, వెంటనే తమకు మెసేజ్ వచ్చేలా కూడా ఏర్పాట్లు చేశామని మనోహర్ తెలిపారు. రైతుల సంతృప్తే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, వారికి ఏ ఇబ్బంది వచ్చినా తెలియచేసేలా రాష్ట్రంలోని అన్ని ఆర్‌ఎ్‌సకేల దగ్గర ఒక క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశామని, దాని ద్వారా అభిప్రాయాలను తమకు పంపొచ్చని పేర్కొన్నారు. రైతులు తీసుకొచ్చే ఽధాన్యం తేమ విషయంలో కేంద్రం 17 శాతం ఉండేలా షరతు పెట్టిందని, దానిని దాటకుండా రైతులు సహకరించాలని, ఒకవేళ కొద్ది వ్యత్యాసం ఉంటే వారిని తిప్పి పంపకుండా కొనుగోలుకు సహకరించాలని సిబ్బందికి సూచించారు. ఈ నెల 28 తేదీ నాటికి తుఫాన్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో రైతుల నుంచి ధాన్యం ఆల స్యం చేయకుండా కొనుగోలు చేసేందుకు యంత్రాంగం మొత్తం సిద్ధంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు.