Share News

AP Chambers: భారత్‌-యూకే వాణిజ్య ఒప్పందంతో ఏపీకి మేలు

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:31 AM

భారత్‌-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) తెలిపింది. చ

AP Chambers: భారత్‌-యూకే వాణిజ్య ఒప్పందంతో ఏపీకి మేలు

ఎగుమతులు ఊపందుకుంటాయి: ఏపీ చాంబర్స్‌

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): భారత్‌-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల నుంచి ఎగుమతులు ఊపందుకుంటాయని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్‌) తెలిపింది. చరిత్రాత్మకమైన ఆ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతమై దీర్ఘకాలంలో ఎగుమతుల వృద్ధిని, ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వాన్ని మెరుగుపరుస్తుందని ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 99 శాతం భారతీయ ఎగుమతులకు యూకే సుంకం రహిత ప్రవేశాన్ని కల్పించడంతో రాష్ట్రం నుంచి వ్యవసాయ, వస్త్ర, తోలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఇంజినీరింగ్‌ తదితర వస్తువుల ఎగుమతులకు అవకాశాలున్నాయని వారు వివరించారు.

Updated Date - Jul 27 , 2025 | 05:33 AM