Share News

AP Teacher Transfers: టీచర్ల బదిలీలు ఆరంభం

ABN , Publish Date - May 22 , 2025 | 04:41 AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌ విడుదల కాగా, జూన్‌ 11 నాటికి ప్రక్రియ పూర్తికానుంది. ఎస్జీటీల బదిలీల విధానంపై స్పష్టత లేక మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోసం ఉపాధ్యాయ సంఘాలు మార్పులు కోరుతున్నాయి.

AP Teacher Transfers: టీచర్ల బదిలీలు ఆరంభం

షెడ్యూల్‌ విడుదల.. మొదలైన దరఖాస్తుల స్వీకరణ

ఏకకాలంలో ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు కూడా

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ ఆ వెంటనే దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి. విజయరామరాజు బుధవారం షెడ్యూలు ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిసేపటికే బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపట్టారు. జూన్‌ 11తో మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తికానుంది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు ఈ బదిలీల ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్లు(ఎ్‌సఏ), సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ)కు వేర్వేరుగా షెడ్యూలు రూపొందించారు. కాగా, ఎస్జీటీల బదిలీలు కూడా ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నా, దీనిపై కొంత సందిగ్ధత నెలకొంది. మాన్యువల్‌ విధానంలో ఎస్జీటీల బదిలీలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల చర్చల్లో అధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఎస్జీటీల బదిలీల విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు పదోన్నతుల ప్రక్రియను కూడా ఏకకాలంలో చేపడుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూలు కూడా విడుదల చేశారు. బదిలీలకు మే 31 కటాఫ్‌ తేదీగా పేర్కొన్నారు. బదిలీల ప్రక్రియ ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే జరుగుతుంది. జిల్లా కలెక్టరు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ల ఆధ్వర్యంలో అధికారులతో ఏర్పాటయ్యే కమిటీల నేతృత్వంలో బదిలీల ప్రక్రియ జరుగుతుంది.


హేతుబద్ధీకరణ పాయింట్లు ఇలా..

కేటగిరీ-1 ప్రాంతంలో ఉన్నవారికి ఏడాదికి ఒకటి, కేటగిరీ-2లో ఉంటే ఏడాదికి 2, కేటగిరీ-3లో ఉంటే ఏడాదికి 3, కేటగిరీ-4లో ఉంటే 5 చొప్పున హేతుబద్ధీకరణ పాయిం ట్లు కేటాయిస్తారు. ఐటీడీఏల్లో పనిచేస్తున్న టీచర్లకు ఏడాదికి ఒక పాయింట్‌ అదనంగా వస్తుంది. అయితే, ప్రస్తుత పాఠశాలలో ఎనిమిదేళ్లకు మించి పనిచేస్తున్నా గరిష్ఠంగా 8 పాయింట్లే ఇస్తారు. అలాగే ప్రత్యేక కేటగిరీల వారికి విడిగా పాయింట్లు ఉంటాయి. అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారికి నెలకు ఒక పాయింట్‌ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్‌ పాయింట్లు ఇస్తారు.

జీవోలో మార్పులు చేయాలి

ఉపాధ్యాయ బదిలీల జీవోలో కొన్ని అసంబద్ధ అంశాలున్నాయని, వాటిని మార్చాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. హృదయరాజు, ఎస్‌. చిరంజీవి కోరారు. ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపట్టాలని, పోస్టుల బ్లాకింగ్‌ తొలగించాలని పేర్కొన్నారు. రెండుసార్లు రేషనలైజేషన్‌కు గురైన వారికి పాత స్టేషన్‌ పాయింట్లు కల్పించే ఆప్షన్‌ ఇచ్చేలా మార్పులు చేయాలని కోరారు. ఈ అంశాలపై ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో అధికారులు హామీ ఇచ్చారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Also Read:

Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు

Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..

Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి

Updated Date - May 22 , 2025 | 04:42 AM