మాది కార్మికుల, కర్షకుల ప్రభుత్వం: ఎమ్మెల్యే వర్ల
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:18 AM
రాష్ట్రంలో ఉన్నది కార్మికుల, కర్షకుల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు.
అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నది కార్మికుల, కర్షకుల ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ‘ఆటో డైవ్రర్లకు దసరా నుంచి రూ.15 వేలు ఆర్థిక సాయం సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న 2.90 లక్షల మందికి రూ.435 కోట్లు లబ్ధి చేకూరుతుంది. ఆటో డైవ్రర్ సోదరుల తరఫున సీఎం చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నా. పేదలకు మేలు జరిగే కార్యక్రమాలకు జగన్ అడ్డుపడుతున్నాడు. జగన్ హయంలో కొందరికే అమ్మ ఒడి, అందరికీ కంటతడి మిగిలింది’ అని ఎమ్మెల్యే వర్ల విమర్శించారు.