Nagalakshmi: 2047కి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 02:58 AM
స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దానికి ఇంధన సంరక్షణ చర్యలు చేపట్టడమే మార్గం...
ఈ లక్ష్య సాధనకు ఇంధన సంరక్షణే మార్గం
ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో నాగలక్ష్మి
అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర - 2047 లక్ష్య సాధనలో భాగంగా నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దానికి ఇంధన సంరక్షణ చర్యలు చేపట్టడమే మార్గం’ అని జెన్కో ఎండీ, ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో నాగలక్ష్మి పేర్కొన్నారు. మనం ఆదా చేసే ప్రతి యూనిట్ ఇంధన భద్రత, ఆర్థిక ఆదాకు దోహదపడుతుందని అన్నారు. ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పరిక్షణ వారోత్సవాలను సోమవారం విజయవాడలో నాగలక్ష్మి ప్రారంభించారు. ట్రాన్స్‌కో జాయింట్ ఎండీ సూర్య సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ... ‘బొగ్గు, డీజిల్, సహజ వాయువు వంటి వనరుల నుంచి విద్యుత్తు ఉత్పత్తి చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక యూనిట్ ఆదా చేయడం అంటే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే’ అని అన్నారు.