Chairman Pattabhiram: త్వరలో రాష్ట్రంలో 75 చెత్తశుద్ధి కేంద్రాలు
ABN , Publish Date - Dec 06 , 2025 | 04:35 AM
రాష్ట్రంలో డంప్ యార్డ్ అన్నదే లేకుండా పనిచేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు.
ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్
తిరుమల, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డంప్ యార్డ్ అన్నదే లేకుండా పనిచేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యమని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన 90 లక్షల టన్నుల చెత్తను ప్రాసెస్ చేసి తొలగించేందుకు త్వరలోనే 75 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏరోజు చెత్త ఆరోజే ప్రాసెస్ అయ్యేలా ఈ ప్లాంట్లు పనిచేస్తాయన్నారు. మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు కూడా నిర్మించబోతున్నామని, తిరుమల కొండపై పేరుకుపోయిన చెత్తను కూడా ఇదే తరహాలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తొలగిస్తున్నారని చెప్పారు.