Science Exposure Tour: నాసా పనితీరుపై ఏపీ విద్యార్థులకు అవగాహన
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:06 AM
ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏరోస్పేస్ టెక్నాలజీ, నాసా పనితీరుపై ఆ సంస్థలో పనిచేసిన రిటైర్డు ఇంజనీర్లు వివరించారు.
న్యూఢిల్లీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏరోస్పేస్ టెక్నాలజీ, నాసా పనితీరుపై ఆ సంస్థలో పనిచేసిన రిటైర్డు ఇంజనీర్లు వివరించారు. ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు అధ్వర్యంలో సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్ పేరిట ఢిల్లీలో పర్యటించిన 52 మంది విద్యార్థులతో శనివారం, నాసా రిటైర్డ్ ఇంజనీర్ల ముఖాముఖి పరిచయ కార్యక్రమం జరిగింది. కాగా, ఆదివారం విద్యార్థులు ఢిల్లీ నుంచి విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు.