Share News

Noida BIT Campus: నోయిడా బిట్స్‌లో ఏపీ విద్యార్థి కాల్చివేత

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:51 AM

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా బిట్‌ క్యాంపస్‌లో ఎంబీఏ చదువుకుంటున్న తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గుర య్యాడు...

Noida BIT Campus: నోయిడా  బిట్స్‌లో ఏపీ విద్యార్థి కాల్చివేత

చిలకలూరిపేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ‘బిట్‌’ క్యాంపస్‌లో ఎంబీఏ చదువుకుంటున్న తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గుర య్యాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్‌(23) నోయిడా లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బిట్‌)లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్‌లో ఆగ్రాకు చెందిన దేవాన్ష్‌ చౌహాన్‌ అతనికి రూమ్‌ మేట్‌. వీరిద్దరూ మంచి స్నేహితులని తెలుస్తోంది. ఏమైందో ఏమో కానీ... బుధ వారం మధ్యాహ్నం వీరి మధ్య గొడవ మొదలైంది. రూంలో నుంచి కాల్పుల శబ్దం వినిపించడంతో సెక్యూరిటీ గార్డు హాస్టల్‌ వార్డెన్‌కు తెలియజేశారు. దీంతో సిబ్బంది బాల్కనీ గుండా పైకి ఎక్కి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశిం చి తలుపు తీశారు. అప్పటికే దీపక్‌, దేవాన్ష్‌ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తలలోకి బుల్లెట్‌ దిగడంతో దీపక్‌ అక్కడిక్కడే మరణించాడు. దీపక్‌ను కాల్చిన అనంతరం దేవాన్ష్‌ తనను తాను కాల్చుకుని ఉండొచ్చని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. దీపక్‌ చిలకలూరిపేట మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్‌ దివ్వెల రత్తయ్య కుమారుడు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు నోయిడాకు బయలుదేరి వెళ్లారు.

Updated Date - Sep 10 , 2025 | 05:51 AM