Share News

AP Anganwadi Workers: 21న అంగన్వాడీల నిరసనలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:56 AM

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు ఏపీ అంగన్వాడీ...

AP Anganwadi Workers: 21న అంగన్వాడీల నిరసనలు

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, మండల కేంద్రాల్లో నిరసనలు తెలపనున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్ల నాయకులు సుబ్బరావమ్మ, లలితమ్మ, వీఆర్‌ జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్‌ అంగన్వాడీలుగా మార్చిన జీవోను వెంటనే విడుదల చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలపనున్నట్లు తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 05:56 AM