AP State: రాష్ట్రానికి 5స్వచ్ఛ అవార్డులు
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:22 AM
రాష్ట్రంలోని ఐదు నగరాలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వక్షణ్ అవార్డులు వచ్చాయి. ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్’ విభాగంలో 10 లక్షల జనాభాపైబడిన నగరాల్లో విజయవాడ,
17న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్న మంత్రి నారాయణ
అమరావతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐదు నగరాలకు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వక్షణ్ అవార్డులు వచ్చాయి. ‘సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్’ విభాగంలో 10 లక్షల జనాభాపైబడిన నగరాల్లో విజయవాడ, 3-10 లక్షలకు మధ్య ఉన్న నగరాల్లో గుంటూరు, 50 వేలు - 3 లక్షల మధ్య ఉన్న నగరాల్లో తిరుపతి అవార్డులు గెలుచుకున్నాయి. ‘మినిస్టీరియల్ అవార్డీ ప్రత్యేక కేటగిరి’లో జీవీఎంసీ విశాఖపట్టణం, మినిస్టీరియల్ అవార్డు రాష్ట్ర స్థాయి కేటగిరిలో రాజమండ్రికి అవార్డులు వచ్చాయి. ఈనెల 17న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంత్రి పొంగూరు నారాయణ ఈ అవార్డులను అందుకోనున్నారు. అవార్డుల రాకపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైౖర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమ ఫలితంగానే జాతీయ స్థాయిలో రాష్ట్రంలోని ఐదు నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించాయని అన్నారు. జాతీయస్థాయిలో స్వచ్ఛ అవార్డులు సాధించడంలో విజయవాడ, గుంటూరు. తిరుపతి, విశాఖపట్నం, రాజమండ్రి నగర ప్రజల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. అవార్డులు రావడానికి శ్రమించిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందికి పట్టాభి అభినందనలు తెలిపారు.