AP Investment: రాష్ట్రానికి మరో 39,602 కోట్ల పెట్టుబడులు
ABN , Publish Date - Jul 13 , 2025 | 03:13 AM
రాష్ట్రానికి మరో రూ.39,602 కోట్ల పెట్టుబడులు తెచ్చి.. 31,399 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రణాళికకు రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది.
31,399 మందికి ఉద్యోగాలు..
తిరుపతిలో ఒకటి, విశాఖలో 2 స్టార్ హోటళ్లు
రూ.12,682 కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు..
ఎస్‌ఐపీసీ భేటీలో ఓకే
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో రూ.39,602 కోట్ల పెట్టుబడులు తెచ్చి.. 31,399 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రణాళికకు రాష్ట్రస్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీసీ) ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఒకటి, విశాఖలో రెండు స్టార్ హోటళ్లతోపాటు, రూ.12,682 కోట్ల పెట్టుబడులతో 5,720 మందికి ఉద్యోగాలు కల్పించే రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన శనివారం జరిగిన ఎస్‌ఐపీసీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి యువరాజ్, న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఎండీ కమలాకరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివి..
విశాఖపట్నంలో ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ రూ.328 కోట్లతో 5 స్టార్ హోటల్‌ను నిర్మిస్తుంది. దీనిలో 1100 మందికి ఉపాధి లభిస్తుంది.
విశాఖలో లాన్‌సమ్ లీజర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రూ.88 కోట్లతో 5 స్టార్ హోటల్‌ను నిర్మిస్తుంది. 720 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
తిరుపతిలో స్టార్‌టర్న్ హోటల్స్ రూ.165 కోట్లతో 5 స్టార్ హోటల్‌ను నిర్మిస్తుంది. ఇందులో 280 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
చిత్తూరులో శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ రూ.202 కోట్లతో 1400 మందికి ఉద్యోగాలు కల్పించే ఇంటిగ్రేటెడ్ డెయిరీని స్థాపిస్తుంది.
విశాఖ మధురవాడలో ఫినమ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ రూ.205 కోట్లతో 2500 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రొడక్ట్ డెవల్‌పమెంట్, ఐటీ సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ కింద ప్రతిభావంతులకు శిక్షణ ఇచ్చే ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది.
తిరుపతిలో గ్రీన్‌లాన్ లిమిటెడ్ రూ.1147 కోట్లతో 1478 మందికి ఉద్యోగాలు. ఏక్సింట్ ఫార్మా రూ.1350 కోట్లతో 1779 మందికి ఉద్యోగాలు. కర్నూలులో అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ రూ.6990 కోట్లతో 2138 మందికి ఉద్యోగాలు. కడపలో జేఎస్‌డబ్ల్యూ ఏపీ స్టీల్స్ రూ.4500 కోట్లతో 2700 మందికి ఉద్యోగాలు. అనకాపల్లిలో రెన్యూ ఫొటోవోల్టాక్స్ రూ.3700 కోట్లతో 1200 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో లారస్ ల్యాబ్స్ రూ.5630 కోట్ల పెట్టుబడితో 6350 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థకు 600 ఎకరాలు కేటాయింపు.
విశాఖ, విజయవాడల్లో లులూ గ్రూప్ రూ.1222 కోట్లతో 1500 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా కుప్పంలో ఏస్ ఇంటర్నేషనల్ రూ.1000 కోట్లతో 2000 మందికి ఉద్యోగాలు. శ్రీకాకుళంలో వీఎ్‌సఆర్ సర్కన్ రూ.39.32 కోట్లతో 246 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుకు భూ కేటాయింపు చేయాలని నిర్ణయం.
మల్లవల్లిలో అవిస ఫుడ్స్ రూ.8,391 కోట్లతో 16,596 మందికి ఉద్యోగాలు కల్పించే మెగా ఫుడ్‌పార్కుకు 115 ఎకరాల కేటాయింపు.
కర్నూలు, నంద్యాలలో రెన్యూ వయోమన్ పవర్ లిమిటెడ్ రూ.1800 కోట్లతో 300 మందికి ఉద్యోగాలు కల్పించే విండ్ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం
కర్నూలు, నంద్యాలలో రెన్యూ విక్రమ్‌శక్తి రూ.3600 కోట్లతో 760 మందికి ఉద్యోగాలు కల్పించే 600 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టుకు ఆమోదం
కడపలో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ రూ.2000 కోట్లతో 1380 మందికి ఉద్యోగాలు కల్పించే 400 మెగావాట్ల సోలార్ పార్కుకు 2400 ఎకరాలు కేటాయింపు.
శ్రీకాకుళంలో పీవీఎస్ రామ్మోహన్ కంపెనీ రూ.204 కోట్లతో 1000 ఉద్యోగాలు కల్పించే రోజుకు 30 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆమోదం.
నంద్యాలలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్సు రూ.4709 కోట్లతో 1200 మందికి ఉద్యోగాలు కల్పించే 800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు ప్రాజెక్టుకు ఆమోదం.
అమరావతిలో కేపీ గ్రూప్ రూ.25 కోట్లతో 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే గ్లోబల్ రెన్యువబుల్ స్కిల్‌డెవల్‌పమెంట్ సెంటర్‌కు ఆమోదం.