Emergency Response: రాష్ట్రంలో హై అలర్ట్
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:51 AM
దేశ రాజధా ని ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో రాష్ట్రంలో హై అల ర్ట్ నెలకొంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి..
పోలీసులతో డీజీపీ టెలికాన్ఫరెన్స్
రాష్ట్రవ్యాప్తంగా ముమ్ముర సోదాలు
అన్ని ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తత
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): దేశ రాజధా ని ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో రాష్ట్రంలో హై అల ర్ట్ నెలకొంది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి.. ఎస్పీలు, రేంజ్‌ల ఐజీలు, డీఐజీలు.. విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనర్లను అప్రమత్తం చేశారు. ‘మీ ప్రాంతంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వెంటనే తనిఖీలు చేపట్టండి.. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో సోదాలు చేయండి. పార్కింగ్ చేసిన కార్లు, లాడ్జిల్లో అనుమానితులపై ఆరా తీయండి. మార్కె ట్లు, ఇతర రద్దీ ప్రాంతాలతో పాటు సున్నితమైన అన్ని చోట్లా ముమ్ముర తనిఖీలు చేపట్టండి.’ అని ఆదేశించారు. పోలీసులు ఎవ్వరూ సెలవు తీసుకోవద్దని, పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు(డయల్ 100, డయల్ 112) వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలనుకోరారు.