Education Department: ఉపాధ్యాయ అవార్డులపై రాష్ట్రస్థాయి కమిటీ
ABN , Publish Date - Aug 27 , 2025 | 06:27 AM
ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు రాష్ట్రస్థాయి కమిటీని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా విద్యాశాఖ మంత్రి, వైస్ చైర్మన్‌గా విద్యాశాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా ఆ శాఖ డైరెక్టర్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, మైసూర్ ఆర్‌ఐఈ ప్రొఫెసర్ మల్లిగాంధీ ఉన్నారు. ఇదిలా వుంటే, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన మాదాబత్తుల తిరుమల శ్రీదేవికి మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఉత్తమ టీచర్‌గా ఎంపిక కావడం రాష్ర్టానికే గర్వకారణమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.