Share News

Fake Documents: రాష్ట్ర కబడ్డీ సంఘ కార్యదర్శి శ్రీకాంత్‌ అరెస్టు

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:51 AM

రాష్ట్ర కబడ్డీ సంఘ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు.

Fake Documents: రాష్ట్ర కబడ్డీ సంఘ కార్యదర్శి శ్రీకాంత్‌ అరెస్టు

  • ఏజ్‌ ఫ్రాడ్‌ చేశారని కేసు నమోదు, స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

విజయవాడ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర కబడ్డీ సంఘ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్‌ను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. క్రీడాకారులను టోర్నమెంట్‌లో ఆడించేందుకు వారి వయస్సుకు సంబంధించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని పటమట పోలీసులకు ఫిర్యాదు అందింది. కొద్దినెలల క్రితం పటమటలోని ఇండోర్‌ స్టేడియంలో యువ సీరిస్‌ పేరుతో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో బాపట్ల జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడి అసలు వయస్సు 25 సంవత్సరాలు ఉంటే, నకిలీ ధ్రువపత్రాలతో అండర్‌ 18 విభాగంలో ఆడించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో రాష్ట్రం లో మొత్తం 18 మంది క్రీడాకారులను ఒక విభాగంలో ఆడాల్సిన వారిని మరో విభాగంలో ఆడించారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పటమట పోలీసులు గురునానక్‌ కాలనీలో శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేశారు. అతనిపై నమోదైన కేసులో సెక్షన్లు ఏడేళ్ల లోపు శిక్ష పడేవి కావడంతో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు.

Updated Date - Dec 09 , 2025 | 04:53 AM