Share News

AP Haj Committee: హజ్‌ హౌస్‌కు స్థలం కేటాయించండి

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:56 AM

విజయవాడ, లేదా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి వెంట 5 నుంచి 6ఎకరాల స్థలాన్ని శాశ్వత హజ్‌ హౌస్‌ నిర్మాణానికి...

AP Haj Committee: హజ్‌ హౌస్‌కు స్థలం కేటాయించండి

  • సీఎంకు రాష్ట్ర హజ్‌ కమిటీ వినతి

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): విజయవాడ, లేదా గుంటూరు పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి వెంట 5 నుంచి 6ఎకరాల స్థలాన్ని శాశ్వత హజ్‌ హౌస్‌ నిర్మాణానికి సీఆర్‌డీఏ ద్వారా కేటాయించాలని సీఎం చంద్రబాబుకు రాష్ట్ర హజ్‌ కమిటీ విజ్ఞప్తి చేసింది. మంగళవారం అమరావతి సచివాలయంలో సీఎంను కలిసి పలు అంశాలపె వినతిపత్రం అందజేసినట్టు రాష్ట్ర హజ్‌ కమిటీ చైర్మన్‌ హసన్‌ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. హజ్‌ యాత్ర-2026 కోసం విజయవాడలో ఎంబార్కేషన్‌ పాయింట్‌ కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు.

Updated Date - Aug 06 , 2025 | 05:57 AM