AP State Govt: రెండో దశ ఫిషింగ్ హార్బర్లకు నిధులు రద్దు చేయొద్దు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:52 AM
రెండో దశలో చేపట్టనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ఇప్పటికే కేటాయించిన రూ.320 కోట్లను రద్దు చేయకుండా ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది.
కేంద్రం ముందు నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు
అమరావతి, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రెండో దశలో చేపట్టనున్న నాలుగు ఫిషింగ్ హార్బర్లకు ఇప్పటికే కేటాయించిన రూ.320 కోట్లను రద్దు చేయకుండా ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు ఆమోదంపై బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర మౌలిక సదుపాయాలు, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరిపి నిధులు పనరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని కృష్ణబాబుకు సీఎం చంద్రబాబు సూచించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు సహకారం తీసుకుని జాతీయ రహదారులు, మౌలిక వసతుల శాఖల మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కావాలని సూచించారు.