Share News

AP Govt: రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:14 AM

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భాన్ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

AP Govt: రాష్ట్ర వేడుకగా ఏడాది పండుగ

  • సుపరిపాలన.. స్వర్ణాంధ్రప్రదేశ్‌ పేరిట ఉత్సవాలు

  • రేపు సాయంత్రం అమరావతిలో భారీ సభ

  • వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు,

  • అధికారులు పాల్గొనాలి.. ప్రభుత్వ ఉత్తర్వులు

అమరావతి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భాన్ని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుపరిపాలన-స్వర్ణాంధ్రప్రదేశ్‌’ పేరుతో నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భాగస్వాములు కావాలని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు. కాగా... కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గురువారం అమరావతిలో జరిగే ఎన్డీయే బహిరంగ సభను విజయవంతం చేయాలని.. అందరూ పాల్గొనాలని సూచించారు.

Updated Date - Jun 11 , 2025 | 04:16 AM