AP Govt: రాష్ట్ర పండుగగా బ్రౌన్ జయంతి
ABN , Publish Date - Oct 30 , 2025 | 04:26 AM
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ప్రతి ఏటా నవంబరు 10న ఆయన జయంతి రోజున ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సీపీ బ్రౌన్) జయంతిని రాష్ట్ర పండుగగా జరపనున్నారు. ప్రతి ఏటా నవంబరు 10న ఆయన జయంతి రోజున ఈ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు బుధవారం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఆయన తన ఖాళీ సమయాన్ని తెలుగు భాష, సాహిత్యానికి అంకిత చేశారు. తన సంపాదనలో ప్రతి రూపాయి తెలుగు భాష, సాహిత్య పునరుజ్జీవనం, ప్రచారం కోసం ఖర్చు చేశారు. తెలుగు అధ్యయనాలకు దోహదపడిన యూరోపియన్ పండితుల్లో సి.పి.బ్రౌన్ పేరు ఒక దీపంలా వెలుగుతుంది. లండన్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యునిగా చివరి శ్వాస వరకూ పని చేశారు. తెలుగు భాష, సాహిత్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.