Gonnabattula Srikanth: సోషల్ ఆడిట్ డైరెక్టర్‌కు అరుదైన పురస్కారం
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:27 AM
ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడంతో పాటు ప్రజాపాలనలో పారదర్శకత పెంచడానికి కృషి చేసిన ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్ట ర్ గొన్నాబత్తుల శ్రీకాంత్ అరుదైన గౌరవం లభించింది.
31న లండన్ వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో ప్రదానం
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడంతో పాటు ప్రజాపాలనలో పారదర్శకత పెంచడానికి కృషి చేసిన ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్ట ర్ గొన్నాబత్తుల శ్రీకాంత్ అరుదైన గౌరవం లభించింది. వరల్డ్ లీడర్స్ సమ్మిట్ ప్రకటించిన పురస్కారాల్లో ‘పబ్లిక్ ట్రాన్స్‌పరెన్సీ, గవర్నెన్స్ లీడర్‌షిప్’ అవార్డు వరించింది. లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆదివారం అవార్డు ప్రదానం జరగనుంది. శ్రీకాంత్ ప్రస్తుతం ఏపీసొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ(ఏపీ శాట్) ఎండీగా ఉన్నా రు. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలో వ్యవస్థలను నడిపే నాయకుల్లో సమర్థత, నాయకత్వ ప్రతిభ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వరల్డ్ లీడర్ సమ్మిట్ ఈ అవార్డులు ప్రకటిస్తుంది. ఉపాధి హామీ పథకంలో ఏపీ సోషల్ ఆడిట్ విభాగాన్ని శ్రీకాంత్ జాతీయస్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ను రోల్‌మోడల్‌గా మార్చారు. సోషల్ ఆడిట్ విభాగంలో గత కొన్నేళ్లుగా శ్రీకాంత్ చేసిన కృషికి జాతీయస్థాయిలో పలు అవార్డులు కూడా లభించాయి.