Raj Kesi Reddy: రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
ABN , Publish Date - Apr 21 , 2025 | 06:51 PM
Raj Kesi Reddy: సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజుల నుంచి సిట్ బృందాలు రాజ్ కేసిరెడ్డి కోసం వెతుకుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు పక్కా సమాచారంతో సోమవారం ఆయన్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులో కాపు కాసి మరీ సిట్ అధికారులు ఆయన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు.