Share News

New Criminal Laws: క్రిమినల్‌ చట్టాల అమల్లో ఏపీ ఆదర్శం కావాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:00 AM

నూతన క్రిమినల్‌ చట్టాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ఢిల్లీ...

New Criminal Laws: క్రిమినల్‌ చట్టాల అమల్లో ఏపీ ఆదర్శం కావాలి

  • కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): నూతన క్రిమినల్‌ చట్టాల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ ఢిల్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తాతో వర్సువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్‌ మోహన్‌ మాట్లాడుతూ ఫోరెన్సిక్‌ ఇకో సిస్టమ్‌ను పటిష్టం చేయాలన్నారు. ఫోరెన్సిక్‌ లేబరేటరీల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయాలని చెప్పారు. నూతన క్రిమినల్‌ చట్టాల అమల్లో ఏపీ దేశానికి రోల్‌ మోడల్‌గా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జైళ్లశాఖ డీజీ అంజనీ కుమార్‌, శాంతిభద్రతల అదనపు డీజీ మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 06:00 AM