AP Chief Secretary: సచివాలయ అసిస్టెంట్ సెక్రటరీల పదోన్నతులకు సై
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:50 AM
రాష్ట్ర సచివాలయంలోని 50 మంది అసిస్టెంట్ సెక్రటరీల పదోన్నతులను నిర్ధారిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ రివర్షన్ జీవో ఉపసంహరణ
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయంలోని 50 మంది అసిస్టెంట్ సెక్రటరీల పదోన్నతులను నిర్ధారిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫలితంగా పదోన్నతులకు మార్గం సుగమమైంది. 2023లో 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా ఏపీ సబార్డినేట్ సర్వీస్ నిబంధనల్లో అప్పటి ప్రభుత్వం మార్పులు చేసిం ది. ఇలా ఇచ్చిన పదోన్నతులను హైకోర్టు ఆదేశాల మేరకు అప్పుడే రివర్షన్ చేశారు. దీంతో ఏఎస్‌వోల నుంచి ఎస్‌వోలు, ఎస్‌వోల నుంచి ఏఎస్‌ల పదోన్నతులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఆనాటి రివర్షన్ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ప్రమోషన్లకు అనుమతి ఇచ్చింది. కాగా, ఉద్యోగుల సమస్యను పరిష్కరించినందుకు అప్సా మాజీ జనరల్ సెక్రటరీ జి. రామకృష్ణ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.