CPM member John Brittas: పన్నుల వసూళ్లకు సమానంగా ఏపీకి పంపిణీ
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:19 AM
దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో రాష్ట్రాల వారీగా సేకరించిన ప్రత్యక్ష పన్నులు, స్థూల జీఎస్‌టీ వసూళ్ల మొత్తం రూ.111.75 లక్షల కోట్లు కాగా..
2020-25 మధ్య గణాంకాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో రాష్ట్రాల వారీగా సేకరించిన ప్రత్యక్ష పన్నులు, స్థూల జీఎస్‌టీ వసూళ్ల మొత్తం రూ.111.75 లక్షల కోట్లు కాగా.. ఆ కాలంలో రాష్ట్రాలకు పన్ను పంపిణీ, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల రూపేణా కేంద్రం బదిలీ చేసిన మొత్తం రూ.75.12 లక్షల కోట్లు అని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఏపీ నుంచి రూ.3.32 లక్షల కోట్లు వసూలు కాగా, కేంద్రం ఏపీకి రూ.3.23 లక్షల కోట్లు బదిలీ చేసిందన్నారు. ఏపీలో వసూళ్లకు దాదాపు సమానంగా కేంద్రం నుంచి నిధులు బదిలీ అయ్యాయని పంకజ్ చౌదరి వివరించారు.