AP Private Degree Colleges Association: ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:56 AM
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది.
డిగ్రీ కాలేజీల సంఘం డిమాండ్ అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.రమణాజీ, జి.రాజ్‌కుమార్ చౌదరి ఆదివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో ఆరు విడతలు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండు విడతలు, మొత్తంగా ఎనిమిది విడతల ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే సమయానుకూలంగా ఫీజులు విడుదల చేయాలని, అప్పుడే విద్యా సంస్థలు నైపుణ్యంతో విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేస్తాయని పేర్కొన్నారు. ఫీజుల విడుదలకు క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.