AP MTech Courses: ఏపీ నిట్‌లో మళ్లీ ఎంటెక్ కోర్సులు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:25 AM
తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉందంటూ మూడేళ్ల క్రితం ఈ కోర్సులను అక్కడ రద్దు చేశారు.
ఈ ఏడాది మొదలైన తరగతులు
సిబ్బంది కొరతతో మూడేళ్ల క్రితం నిలిపివేత
(భీమవరం-ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెం ఏపీ నిట్‌లో ఎంటెక్ కోర్సులు మళ్లీ ప్రారంభమయ్యాయి. అధ్యాపక సిబ్బంది కొరత ఉందంటూ మూడేళ్ల క్రితం ఈ కోర్సులను అక్కడ రద్దు చేశారు. గత ఏడాది ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడంతో ఎనిమిది విభాగాల్లో ఎంటెక్ కోర్సులను మళ్లీ అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు అధ్యాపక సిబ్బంది కొరత కారణంగా బీటెక్ సీట్లు కుదించడంతోపాటు, ఎంటెక్ కోర్సులను రద్దు చేశారు. గత ఏడాది ప్రొఫెసర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో 18 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు. కేంద్రం అనుమతించిన మరో 62 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. డైరెక్టర్ నియామకం పూర్తయిన తర్వాత మిగతా అధ్యాపక పోస్టులను కూడా భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది నుంచి ఏపీ నిట్‌లో బీటెక్ సీట్ల సంఖ్య పెంపును అమలు చేయాలని నిట్ అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. మరోవైపు ఏపీ నిట్ డైరెక్టర్ నియామక కోసం ఇంటర్వ్యూలు పూర్తి కావడంతో ముగ్గురు అభ్యర్థుల జాబితా కేంద్రానికి చేరుకుంది. రాష్ట్రపతి వద్దకు జాబితా వెళితే, ఒకరిని నిట్ డైరెక్టర్‌గా నియమించనున్నారు. ప్రస్తుతం అకడమిక్, ప్లేస్‌మెంట్స్ పరంగా ఏపీ నిట్ మంచి స్థాయిలో ఉంది.