Graduation Ceremony: ఘనంగా ఏపీ నిట్ స్నాతకోత్సవం
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:48 AM
విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని టాటా సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న సూచించారు.
తాడేపల్లిగూడెం అర్బన్, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని టాటా సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ వి.రాజన్న సూచించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్‌లో 7వ స్నాతకోత్సవం నిట్ ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2021-25లో బీటెక్ పూర్తిచేసుకున్న 667 మంది విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్‌డీ పూర్తి చేసిన 29 మందికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు. రాజన్న మాట్లాడుతూ దేశ భవిష్యత్‌కు డిజిటల్ టెక్నాలజీలే ప్రధాన శక్తిగా మారనున్నాయన్నారు.