Share News

ఉద్యోగులూ అందుబాటులో ఉండండి: ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్‌

ABN , Publish Date - Oct 28 , 2025 | 05:51 AM

మొంథా తుఫా ను తీవ్రత నేపథ్యంలో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి అండ గా నిలవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు.

ఉద్యోగులూ అందుబాటులో ఉండండి: ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్‌

విజయవాడ(గాంధీనగర్‌), అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫా ను తీవ్రత నేపథ్యంలో ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి అండ గా నిలవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ పిలుపునిచ్చారు. ‘ప్రాణ, ఆస్తి, పంట నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం, కలెక్టర్లు, అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంది. విపత్తుల సమయంలో ఉద్యోగుల పాత్ర కీలకం. మానవతాదృక్పథంతో ప్రజలకు సేవలు అందించాలి. ప్రజలకు భరోసా కల్పించేలా పని చేయాలి’ అని విద్యాసాగర్‌ సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Updated Date - Oct 28 , 2025 | 05:51 AM