Minister Kondapalli Srinivas: ఏపీ ఎంఎస్ఎంఈలకు జర్మనీ సహకారం
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:13 AM
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న పరిశ్రమలకు అన్ని ప్రోత్సాహకాలూ అందించేందుకు చర్యలు చేపడుతోందని...
చెన్నైలో ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక సదస్సు
పరిశ్రమలకు ప్రోత్సాహానికి ఎల్‌వోఐపై మంత్రి కొండపల్లి సంతకాలు
చెన్నై/అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న పరిశ్రమలకు అన్ని ప్రోత్సాహకాలూ అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎంఎస్ఎంఈల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నైలోని హిల్టన్ హోటల్‌లో ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 59వ వార్షిక ప్రాంతీయ సదస్సుకు రాష్ట్రం తరఫున మంత్రి హాజరయ్యారు. ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా ఏపీలో ఎంఎస్ఎంఈల ప్రోత్సాహకానికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)పై సంతకాలు చేశారు. పరిశ్రమలల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, యువ పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎంఎస్ఎంఈ పార్క్‌ల అభివృద్ధికి, ఉత్పత్తుల ఎగుమతికి, సాంకేతిక పరిజ్ఞానంలో, స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్‌ల ఏర్పాటుకు జర్మనీ సహకారం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది జర్మన్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.