AP MRPS Holds Protest: ఢిల్లీలో ఏపీ ఎమ్మార్పీఎస్ ధర్నా
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:56 AM
రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్...
న్యూఢిల్లీ, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఏపీ ఎమ్మార్పీఎస్) డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 80 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ఏపీలో దళిత, గిరిజన జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంటు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో దేశానికి 2వ రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు.