Share News

AP Ministers: ఏపీలో పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Sep 30 , 2025 | 04:25 AM

దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో పలుప్రముఖ బహుళజాతిసంస్థల ప్రతినిధులతో రాష్ట్రమంత్రులు పి.నారాయణ, బీసీజనార్దన్‌రెడ్డి బృందం...

AP Ministers: ఏపీలో పెట్టుబడులు పెట్టండి

  • సియోల్‌లో ఎల్జీ సహా పలు ప్రతిష్ఠాత్మక సంస్థలకు మంత్రులు నారాయణ, జనార్దన్‌రెడ్డి ఆహ్వానం

అమరావతి,సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి): దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో పలుప్రముఖ బహుళజాతిసంస్థల ప్రతినిధులతో రాష్ట్రమంత్రులు పి.నారాయణ, బీసీజనార్దన్‌రెడ్డి బృందం సోమవారం సమావేశమైంది. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించింది. ప్రముఖ మల్టీ నేషనల్‌ కంపెనీ ఎల్జీ సంస్థ హెడ్‌క్వార్టర్స్‌లో ఆ సంస్థ ప్రతినిధులను కలుసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావర ణం ఉందని తెలిపింది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఐఐ ఆధ్వర్యంలో విశాఖ సదస్సు తలపెట్టామని మంత్రులు పేర్కొన్నారు.

ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో మంత్రుల భేటీ

సియోల్‌లో ప్రముఖ కంపెనీ ఎల్‌ఎస్‌ గ్రూప్‌ ప్రతినిధులతో మంత్రులు నారాయణ, జనార్దన్‌రెడ్డి బృందం సమావేశమైంది. ఎలక్ట్రిక్స్‌, ఎలక్ట్రిసిటీ, మెటీరియల్స్‌, ఎనర్జీ తదితర రంగాల్లో ఎల్‌ఎస్‌ గ్రూప్‌నకు విశేష అనుభవం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ ఎల్‌ఎస్‌ ప్రతినిధులను మంత్రులు ఆహ్వానించారు. ఈ సమావేశం అనంతరం షూఆల్స్‌ కంపెనీ చైర్మన్‌ నెవోంగ్‌ లీతోనూ వారు సమావేశమయ్యారు.

Updated Date - Sep 30 , 2025 | 04:26 AM