State Level Revenue Sport: ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:11 AM
ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమేనని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత పేర్కొన్నారు. రెవెన్యూ క్రీడాపోటీలు విజయవంతంగా నిర్వహించడమే....
రెవెన్యూ క్రీడా పోటీలే నిదర్శనం: మంత్రులు పయ్యావుల, అనగాని, సవిత
అనంతపురం క్లాక్‌టవర్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఫ్రెండ్లీ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమేనని మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత పేర్కొన్నారు. రెవెన్యూ క్రీడాపోటీలు విజయవంతంగా నిర్వహించడమే అందుకు నిదర్శనమన్నారు. 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా, సాంస్కృతిక పోటీలు అనంతపురంలో ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పల్లె సింధూరారెడ్డి, అనంత కలెక్టర్ ఆనంద్, బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, టెన్నిస్ ప్లేయర్ మైనేని సాకేత్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 38పాయింట్లతో అనంతపురం జట్టు ఓవరాల్ చాంపియన్‌గా అవతరించింది. 37 పాయింట్లతో విశాఖ, 30 పాయింట్లతో కాకినాడ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.