AP Minister Lokesh: డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టండి
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:20 AM
రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు, టెక్నాలజీ పరంగా ఏపీని ప్రగతి పథంలో నడిపేందుకు మంత్రి లోకేశ్ ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల ముఖ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు....
అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయండి
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పనులపై చర్చ
అమెరికాలో ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ
ఏపీలో ఏటీఎంపీ యూనిట్ ఏర్పాటు చేయండి
ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో భేటీలో లోకేశ్
లోకేశ్ ప్రతిపాదనలకు టెక్ దిగ్గజాల సానుకూలత
మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా కౌన్సిల్ భేటీలో లోకేశ్
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాఽధించేందుకు, టెక్నాలజీ పరంగా ఏపీని ప్రగతి పథంలో నడిపేందుకు మంత్రి లోకేశ్ ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల ముఖ్య ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికా, కెనడా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో పాటు ఇంటెల్, ఎన్‌విడియా, అడోబ్, జూమ్ తదితర సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో సుందర్ పిచాయ్‌తో సుమారు 2 గంటలపాటు భేటీ జరిగింది. విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి ఈ సందర్భంగా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖలో ఏఐ డేటాసెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంపై చర్చించారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లింగ్, కాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలని, విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెం టర్-సర్వర్ తయారీ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించాలని సుందర్ పిచాయ్‌కి విజ్ఞప్తి చేశారు. పిచాయ్ మాట్లాడుతూ.. భారత్‌లో క్లౌడ్ రీజియ న్ల విస్తరణతో పాటు ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్’ కార్యక్రమం ద్వారా స్టార్ట్‌పలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీ ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. శాంటాక్లారాలోని ఇంటెల్ సంస్థ కేంద్ర కార్యాలయంలో ఇంటెల్ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్(ఏటీఎంపీ) యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ నెక్ట్స్ జెన్ టెక్నాలజీ నాయకత్వం సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. ‘ఇంటెల్-అమరావతి ఏఐ రిసెర్చి సెంటర్’ను శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఏఐ శిక్షణకు మద్దతు ఇవ్వండి
గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయూ మాన్యుఫ్యాక్చరింగ్‌లో అంతర్జాతీయస్థాయిలో అగ్రగామి సంస్థ అయిన ఎన్‌విడియా వైస్ ప్రెసిడెంట్ (ఎంటర్‌ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్) రాజ్ మిర్‌పూరి తో జరిగిన భేటీలో లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీలో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ఏపీలో ఏఐ నైపుణ్యాలు, రియల్ టైమ్ గవర్నెన్స్ ఏఐ చాట్‌బాట్ వ్యవస్థను ప్రారంభించామని, ప్రభు త్వ అధికారులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, పరిశోధకులకు క్వాంటమ్ సిమ్యులేటర్లు అందించేందుకు ఏపీ విశ్వవిద్యాలయాలు, ఆర్‌అండ్‌డీ సంస్థలతో పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలన్నారు. భారతదేశంలో డీప్‌టెక్ స్టార్ట్‌పల కోసం ఎన్‌విడియా 850 మిలియన్ డాలర్లకుపైగా నిధులను ప్రకటించిందని, వాటిని ఏపీలోని డీప్‌టెక్ స్టార్ట్‌పల్లో పెట్టుబడులు, మెంటారింగ్ కోసం అనుసంధానించాలని లోకేశ్ కోరారు. గతంలో ఏపీ ప్రభుత్వంతో ఎన్‌విడియా చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని కోరారు.
అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌తో జరిగిన భేటీలో.. విశాఖలో అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ) ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. శంతను డైరెక్టర్‌గా ఉన్న పైజర్ సంస్థ ఏపీలో ఉన్న ఔషధ పరిశ్రమ జోన్లలో వ్యాక్సిన్లు, బయోలాజిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. మరో సంస్థ కేకేఆర్.. ఆరోగ్య సంరక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాలన్నారు.
జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చా మి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్చువల్ క్లాస్‌రూంల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
నల్లమలలో స్టెర్లింగ్ రిసార్ట్స్ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్ సీఈవో ప్రేమ్ వాత్సాను కెనడాలో కలిసిన లోకేశ్ కోరారు.
ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకరించాలని బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ప్రెసిడెంట్ గోల్డీ హైదర్‌ను లోకేశ్ కోరారు. టొరంటోలో హైదర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు.
ఏపీలో గ్రీన్ ఎనర్జీ, లాజిస్టిక్స్,మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్‌స్టమెంట్ బోర్డు(సీపీపీఐబీ) గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ బృంద సభ్యుడు టిమ్ డౌనింగ్‌ను లోకేశ్ కోరారు.
మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన: మంత్రి లోకేశ్
విశాఖపట్నంలో మార్చిలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కో సిలికాన్ వ్యాలీలో జరిగిన బే-ఏరియా కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం’ అనే అంశంపై మాట్లాడారు. ‘‘భారత ఏఐ విప్లవంలో ఏపీని అగ్రపథాన నిలుపుతాం. సీఎం చంద్రబాబు ఈ దిశ గా చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ఈ దిశగా జరుగుతున్న కృషిలో గూగుల్ పెట్టుబడి ప్రారం భం మాత్రమే. ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణుడు ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఏపీలో కాన్వర్జేషనల్ ఏఐ ద్వారా స్కిల్ సెన్సెస్ చేపడుతున్నాం. ఏసీ టెక్నీషియన్ నుంచి ఏఐ ఇంజనీరు వరకు నైపు ణ్య అంచనా చేపడతాం. దేశంలోనే యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. భవిష్యత్తులో ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం.’’ అని మంత్రి లోకేశ్ వివరించారు.
విద్యాసంస్థలు, స్టార్ట్‌పలు, ప్రభుత్వం చేపట్టే ఆరోగ్య, వ్యవసా యం, వాతావరణ పరిశోధనలకు హెచ్‌పీసీ క్లస్టర్లు ఏర్పాటుతో మద్ద తు ఇవ్వండి. ఏపీ ప్రభుత్వం యు వత నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన కృషి చేస్తోంది. ఇంటెల్‌కు భవిష్యత్తు నైపుణ్య వర్క్ ఫోర్సు అవసరాన్ని తీర్చిదిద్దేందుకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టండి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ పాఠ్య ప్రణాళికలో ఇంటెల్ శిక్షణ కార్యక్రమాలు చేర్చే అంశాన్ని పరిశీలించండి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్ స్థాపించండి.
- ఇంటెల్ సీటీవోతో లోకేశ్
భారీ పెట్టుబడులకు పునాది పడుతోంది
మన్నవ మోహనకృష్ణ
మంత్రి లోకేశ్ అమెరికా పర్యటనతో ఏపీలో భారీ పెట్టుబడులకు పునాది పడుతోందని ఏపీ టెక్నాల జీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మో హనకృష్ణ అన్నారు. లోకేశ్ పర్యటనలో ఆయన పాల్గొన్నారు. మోహనకృష్ణ మాట్లాడుతూ, ఏపీని ప్ర పంచస్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడానికి లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందు కు ప్రపంచ స్థాయి పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారన్నారు.