Share News

Minister Srinivas Varma: హైవేల పనులు వేగంగా పూర్తి చేయండి

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:39 AM

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజ్ఞప్తి చేశారు.

Minister Srinivas Varma: హైవేల పనులు వేగంగా పూర్తి చేయండి

  • కేంద్ర మంత్రి గడ్కరీకి శ్రీనివాసవర్మ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పలు హైవే ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో శనివారం గడ్కరీ పాల్గొననున్న నేపథ్యంలో గురువారం ఆయనతో శ్రీనివాసవర్మ భేటీ అయ్యారు. ఎన్‌హెచ్‌-165లో దిగమర్రు-ఆకివీడు- భీమవరం బైపాస్‌ రహదారి, ఎన్‌హెచ్‌-216లో భాగంగా నర్సాపురం బైపాస్‌ రహదారి (కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి) నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన నర్సాపురం బైపాస్‌ పనులను పునఃప్రారంభించాల్సిన ఆవశ్యకతను శ్రీనివాసవర్మ తెలియజేశారు.

Updated Date - Aug 01 , 2025 | 05:41 AM