Share News

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Jul 28 , 2025 | 06:04 AM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే వైసీపీ ప్రభుత్వ హ యాంలో ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కాం అతి పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

ఏపీ లిక్కర్‌ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల

కడప ఎన్టీఆర్‌సర్కిల్‌/రైల్వేకోడూరు/ఓబులవారిపల్లె, జూలై 27(ఆంధ్రజ్యోతి ): ఢిల్లీ లిక్కర్‌ స్కాం కంటే వైసీపీ ప్రభుత్వ హ యాంలో ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కాం అతి పెద్దదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం కడప జిల్లాలో నిర్వహించిన సుపరిపాలన-తొలి అడుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్ల మంత్రిగా పేరొందారని ఆరోపించారు. ఇక, వైఎస్‌ జగన్‌ మామిడి కాయల్లాగా మనుషులను తొక్కించుకుం టూ పోతుంటారని వ్యాఖ్యానించారు. పులివెందులలో కూడా తల్లికి వందనం డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పడ్డాయని తెలిపారు.

Updated Date - Jul 28 , 2025 | 06:05 AM