AP Privileges Committee: పెండింగ్ కేసులపై సభాహక్కుల కమిటీ సీరియస్
ABN , Publish Date - Sep 27 , 2025 | 06:19 AM
ఎమ్మెల్సీల విషయంలో సభాహక్కులు ఉల్లంఘించిన అధికారులపై 2019 నుంచి ఇప్పటి వరకు 26 కేసులు పెండింగ్‌లో ఉండటంపై శాసనమండలి...
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీల విషయంలో సభాహక్కులు ఉల్లంఘించిన అధికారులపై 2019 నుంచి ఇప్పటి వరకు 26 కేసులు పెండింగ్‌లో ఉండటంపై శాసనమండలి సభాహక్కుల కమిటీ(ప్రివిలేజ్ కమిటీ) సీరియస్ అయింది. కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆధ్వర్యంలో ఈ కమిటీ తొలి భేటీ శుక్రవారం జరిగింది. కమిటీ సభ్యులు జయేంద్ర భరత్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తలసిల రఘురాం, రాజగొల్ల రమేశ్ యాదవ్, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యుల హక్కులు, అధికారాలు, అలాగే వచ్చిన ఫిర్యాదులపై విస్తృత చర్చ జరిగింది. 2019 నుంచి కేసులు పెండింగ్‌లో ఉండటంపై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్ కేసులన్నింటినీ అక్టోబరు 21లోగా పరిష్కరించాలని నిర్ణయించింది. సంబంధిత అధికారులకు ఫైనల్ నోటీసులు జారీచేసి వివరణ తీసుకోవాలని, వివరణ ఇవ్వని వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.