Share News

Minister N. Manohar: 2 బిల్లులకు మండలి ఆమోదం

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:36 AM

మండలిలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ‘నాలా’ ఫీజును ఆయా పంచాయతీల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పన కోసం...

Minister N. Manohar: 2 బిల్లులకు మండలి ఆమోదం

ఇంటర్నెట్ డెస్క్: మండలిలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ‘నాలా’ ఫీజును ఆయా పంచాయతీల్లో తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించుకునేందుకు చట్టంలో సవరణలు చేస్తూ తీసుకువచ్చిన ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2025ను మంత్రి నాదెండ్ల మనోహర్‌ సభలో ప్రతిపాదించారు. అదేవిధంగా.. భారతీయ నాగరిక సురక్షా సంహిత(ఏపీ సవరణ) బిల్లు-2025ను న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రవేశ పెట్టారు. ఈ రెండు బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.

Updated Date - Sep 25 , 2025 | 06:37 AM