Legislative Committee Stresses Transparency: పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యం
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:06 AM
ప్రభుత్వ రంగ సంస్థలకు జవాబుదారీతనం ముఖ్యమని, అందుకనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన...
ప్రభుత్వరంగ సంస్థలకు ఇవే కీలకం
ఆడిట్ అభ్యంతరాలకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు సిఫారసు
శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ రవికుమార్
గుంటూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ సంస్థలకు జవాబుదారీతనం ముఖ్యమని, అందుకనుగుణంగా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఏపీ ఏవియేషన్, ఏపీ ఎయిర్ పోర్ట్స్ అభివృద్ధి కార్పొరేషన్ల కార్యకలాపాలపై కమిటీ సమీక్షించింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ.. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ 182 సంస్థల కార్యకలాపాలను విచారణ చేయనుందని, ఇప్పటి వరకు 30 సంస్థలను పరిశీలించిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్న ప్రతి సంస్థా గణాంకాలు, ఆడిట్, ఆర్థికపరమైన వివరాలు విధిగా.. పక్కాగా చూపాలన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలోగా తనిఖీలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. వార్షిక కార్యకలాపాలు, వార్షిక ఆదాయం, వ్యయంపై విధిగా నివేదికలు సమర్పించాలని కోరారు. ఆడిట్ అభ్యంతరాలను సంస్థలు సమర్పించాలన్నారు. ఏపీ అటవీ అభివృద్థి సంస్థ గత ఎనిమిదేళ్లుగా, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ 2014 నుంచి వార్షిక నివేదికలు సమర్పించక పోవడంపై ప్రశ్నించారు. ఆడిట్ అభ్యంతరాలకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలకు సిఫారసు చేయాలన్నారు. రాష్ట్రంలో అటవీ అభివృద్ధి సంస్థను మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆయన సూచించారు. అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్టులను పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించాలన్నారు. ఏపీ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సంస్థ ఆరేళ్లుగా ఆడిట్ చేయకపోవడాన్ని రవికుమార్ ప్రశ్నించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి నివేదికలు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హాజరు కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ సంస్థ కార్యకలాపాల సమీక్షను నిర్వహించలేదు. ఏపీ అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గిరీషా ఆయా సంస్థల ప్రగతి నివేదికలను వివరించారు. ఏపీ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ రెండు, మూడు వారాల్లో గణాంకాలు అప్ డేట్ చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించేందుకు, కర్నూలు ఎయిర్‌పోర్టుకు మరిన్ని ఎక్కువ విమాన రాకపోకలు సాగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అదనంగా తొమ్మిది ఎయిర్ పోర్ట్‌ల అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. ఆ