AP Lawyers Welfare Fund: న్యాయవాదులకు 5.60కోట్ల ఆర్థిక ప్రయోజనాలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:20 AM
న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్యఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల...
ఏపీ న్యాయవాదుల సంక్షేమనిధి కమిటీ కీలక నిర్ణయాలు
అమరావతి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్యఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల సంక్షేమనిధి కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన న్యాయవాదుల సంక్షేమనిధి కమిటీ సమావేశంలో సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి.నరసింగరావు, ఏపీ హైకోర్టు, న్యాయశాఖ ప్రతినిధులు హాజరయ్యారు. ఇటీవల మరణించిన 54 మంది న్యాయవాదుల కుటుంబ సభ్యులకు రూ 3.51కోట్లు, వైద్య ఖర్చుల నిమిత్తం 137మంది న్యాయవాదులకు రూ 1.90 కోట్లు, పదవీ విరమణ ప్రయోజనం కింద ఏడుగురు న్యాయవాదులకు రూ,19.20 లక్షలు వెరసి.. రూ 5.60 కోట్లు మంజూరు చేసింది.