ఉద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం: బొప్పరాజు
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:04 AM
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఉద్యోగులను పట్టించుకోలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు...
తిరుపతి అర్బన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఉద్యోగులను పట్టించుకోలేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్లతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి మూడు నెలల్లో పరిష్కరించుకుందామన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులకున్న రూ.వేల కోట్ల బకాయిలపై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చించలేదన్నారు. వచ్చే మూడునెలల్లో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.