AP JAC: దసరాకు రెండు డీఏలు ప్రకటించండి: ఏపీ జేఏసీ
ABN , Publish Date - Sep 25 , 2025 | 07:02 AM
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కేఎ్‌సఎస్ ప్రసాద్ తెలిపారు.
విజయవాడ (గాంధీనగర్), సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి కేఎ్‌సఎస్ ప్రసాద్ తెలిపారు. విజయవాడ ఎన్జీవో హోంలో బుధవారం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ దసరాకు నాలుగు డీఏ బకాయిల్లో కనీసం రెండైనా ప్రకటించి ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం నింపాలని కోరారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తే పోరాటలే శరణ్యమన్నారు. కేఎ్‌సఎస్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు.