Share News

Intermediate Exams: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Oct 04 , 2025 | 05:00 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నారాయణ్‌ భరత్‌ గుప్తా శుక్రవారం....

Intermediate Exams: ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు

  • అదే నెల 1 నుంచి ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌

  • షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించనున్నట్టు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నారాయణ్‌ భరత్‌ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ పరీక్షలు మార్చి 24న ముగియనున్నాయని పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరగనున్నాయని తెలిపారు. ఫిబ్రవరి 1న ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్‌ రెగ్యులర్‌ విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో పాటు ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష జనవరి 21న, పర్యావరణ పరీక్ష జనవరి 23ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 05:00 AM