Share News

AP High Court: కృష్ణంరాజుపై కేసు వివరాలు సమర్పించండి

ABN , Publish Date - Jun 20 , 2025 | 06:04 AM

అమరావతిపై జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

AP High Court: కృష్ణంరాజుపై కేసు వివరాలు సమర్పించండి

  • తుళ్లూరు పోలీసులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): అమరావతిపై జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కృష్ణంరాజు వేసిన పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. కృష్ణంరాజు తరఫు న్యాయవాది డీఎస్ఎన్వీ ప్రసాద్‌బాబు చెప్పిన వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

Updated Date - Jun 20 , 2025 | 06:04 AM